శుభకృతు నామ సంవత్సర ఉగాది
ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరం ఎంటా అని అనుకుంటున్నారా? జనవరి 1st జరుపుకునేది ఇంగ్లీష్ క్యాలెండర్ న్యూ ఇయర్, ఉగాది తెలుగు క్యాలెండర్ న్యూ ఇయర్. జనవరి 1st ఉన్న హడావిడి మన ఉగాది కి లేకుండా పోయింది. ఎలా అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ లో నెలలు వుంటాయో అలా మన తెలుగు క్యాలెండర్ లో మాసం అని ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి లాగానే 12 మాసాలు ఉంటాయి. జనవరి ఎలాగైతే మొదటి నెలో, చైత్ర మాసం మొదటి మాసం అనమాట. చైత్ర మాసం లో చేసుకునే మొదటి పండగే ఉగాది, చైత్ర శుద్ధ పాడ్యమి రోజు చేసుకుంటాం ఉగాది పండుగని. యుగాది – యుగా + ఆది, శకం + నవ్యారంభం = హిందూ క్యాలెండర్ లో మొట్ట మొదటి రోజు. యుగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం, పురాణాల ప్రకారం బ్రహ్మ ఉగాది రోజే సృష్టిని ప్రారంభించాడు అని చెపుతారు. ఉగాది తరువాత 9 వ రోజు శ్రీ రామ నవమి చేసుకుంటాం. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి చేసుకుంటాం. ఇవే కాకుండా ఇంకా చాలా పూజలు చేస్తారు చైత్ర మాసంలో.
మనం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో ఉగాది అని చేసుకుంటాం, మహారాష్ట్రలో గుడి పడ్వా అని చేసుకుంటారు. పల్లెటూల్లకి కనుక వెళ్తే ఉగాది రోజు అందరూ కళ్ళాపి జల్లుతారు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తారు. ఇంటికి తోరణాలు కడతారు. ఆ రోజు కొత్త దుస్తుల్లో కనిపిస్తారు మరియు అందరూ కలిసి చేసుకునే పండగ. కుదిరితే అందరూ పంచాంగ శ్రవణం వినండి, ఉగాది రోజున చాలా వంటకాలు చేస్తారు పులిహోర, పాయసం, బొబ్బట్లు, బూరెలు, గారెలు ఇలా చాలా చేసుకుంటారు. ఇవ్వన్ని చేసుకున్నా చేసుకోకపోయిన ఒక ముఖ్యమైన వంటకం మాత్రం ఉంటుంది, అదే ఉగాది పచ్చడి.
ఉగాది పచ్చడికి చాలా ప్రాముఖ్యత వుంది, ఉగాది పచ్చడి అంతే షధ్రుచులు. షధ్రుచులు అంటే 6 రుచులు, ఆ 6 ఏంటి అంటే ఉప్పు, కారం, తీపి, వగరు, పులుపు మరియు చేదు. ఉగాది పచ్చడి చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏంటి అంటే ఉప్పు, కారం, బెల్లం, వేప, చింతపండు మరియు మామిడికాయ. ఈ షధ్రుచులు నుంచి తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉందండోయ్, ఎలాగైతే 6 వివిధ రుచులు వుంటాయో అలాగే మన జీవితంలో కూడా 6 రకాల భావోద్వేగాలని ప్రతీక చేస్తుంది ఈ ఉగాది పచ్చడి, అవి ఏంటి అంటే.
ఉప్పు/ salty
ఉప్పు కోసం ఉప్పు నే వాడతారు, ఉప్పు ఉప్పడనాన్ని ఇస్తుంది.
ఉప్పు గాడు ఏం చెప్తున్నాడు అంటే, జీవితంలో భయానక పరిస్థితుల్లో మనం పడచ్చు అని చెప్తున్నాడు.
కారం/ Spicy
కారం కోసం కారం ని గానీ పచ్చి/ ఎండు మిరకాయలని వాడతారు. కారం యొక్క రుచి కారం గనే ఉంటుంది. కారం గాడు ఏం చెప్తున్నాడు అంటే, జీవితంలో కోపం ఉండచ్చు అని చెప్తున్నాడు.
తీపి/ Sweet
తీపి కోసం బెల్లం వాడతారు. బెల్లం గాడు ఏం చెప్తున్నాడు అంటే, జీవితంలో ఆనందం ఉంటుంది అని చెప్తున్నాడు.
వగరు/ Bitter
వగరు కోసం వేప ని వాడతారు, ప్రత్యేకంగా చెప్పాలంటే వేప పూత ని వాడతారు. వేప గాడు ఏం చెప్తున్నాడు అంటే, జీవితంలో చేదు/బాధలు కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు.
పులుపు/ Sour
పులుపు కోసం చింతపండు వాడతారు. పులుపు గాడు ఏం చెప్తున్నాడు అంటే, జీవితంలో కూడా పరిస్థితులు ఉండచ్చు అని చెప్తున్నాడు.
చేదు/Tangy
చేదు కోసం పచ్చి మామిడికాయని వాడతారు. మామిడి గాడు ఏం చెప్తున్నాడు అంటే, జీవితంలో మనం అనుకున్న విధంగా, అనుకొని విధంగా చాలా జరుగుతాయి అన్నీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్తున్నాడు.
అందరూ ఉగాది పచ్చడిని మరియు మీ ఇంట్లో చేసుకునే రుచికరమైన వంటలను తిని ఆనందించండి.
శుభకృతు శుభకృతు అని అనుకుంటూ ఉండండి.. తెలియకుండానే శుభం జరుగుతుందేమో, హహా..
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు!
-Tejaswi