Jaan Dhoonga Desh Nahi

మనకి మహాత్మా గాంధీ గురించి తెలుసు, భగత్ సింగ్ గురించి తెలుసు… కానీ, దేశం కోసం నిస్వార్థంగా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సరిహద్దున దేశ రక్షణ కోసం శత్రువుతో యుద్ధం చేసే సైనికుడు, దేశయందున విధులను నిర్వర్తించే రక్షక భటులు, ప్రతి పౌరుడు కూడా దేశం కోసం నిస్వార్థంగా పనిచేసినప్పుడే ఆ దేశం విలువలతో కూడిన గొప్ప దేశం అవుతుంది.

మనం అడుక్కుతినే పరిస్తితిలో ఉన్నా పక్కనొడి అన్నంలో మట్టి కొట్టే స్వభావం మన పొరుగు దేశం పాకిస్థాన్ వాళ్ళది. ఉగ్రవాదులకు అదేదో బ్యాంక్ లోన్ ఇచ్చి కంపెనీ పెట్టి ఉద్యోగులను తీర్చిదిద్దినట్టు ఉగ్రవాదులను తయారుచేస్తుంది. ఎన్నిసార్లు అంతర్జాతీయంగా UN లో మొట్టికాయలు తిన్న బుద్ది మాత్రం రాదు. అలా దొంగ దెబ్బ తీయడం మాకేం తెలీదు అని ఆ దేశ నాయకులు అనడం, మనం లౌకికవాదoలో మునిగిపోయి సర్దుకుపోవడం, మన చేతకాని తనంలాగా వాళ్ళు అనుకోవడం మరలా దేశంలో చొరబడటం చంపటం చావడం ఇదేపరిస్థితి. ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు సార్లు ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయారు.

అలా! 6 దశాబ్దాలుగా దొంగ దెబ్బ తీస్తున్న పాకిస్తాన్ కి దొరికిన ఒక రాజకీయ అవకాశమే 26/11 , 2008 ముంబై దాడి. లష్కరే గ్రూపుకి చెందిన 10 మంది ముష్కరులు దేశంలోకి చొరబడి చేసిన మారణ హోమంలో 166 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. 9 మంది ఉగ్రవాదులు భారత రక్షకుల చేత చంపబడ్డారు. ఆ మిగిలిన ఒక్క ఉగ్రవాదే “కసబ్” దొంగగా ముంబై తీరంలో చొరబడి ఛత్రపతి శివాజీ టెర్మినల్లో మొదలైన కాల్పులు రద్దీగా వుండే ఎనిమిది ప్రదేశాలలో బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా దేశం మొత్తాన్ని భయానక వాతావరణం కలిగించారు. చివరగా తాజ్ హోటల్లో 400 మందికి పైగా ప్రజలను, హోటల్ యాజమాన్యంతో సహా బందీలుగా పెట్టుకున్నారు. నవంబర్ 26 రాత్రి 8:30 గంటలకు మొదలైన కాల్పులు, రెండు గ్రూపులుగా విడిపోయి కనిపించిన ప్రజలను కనికరం లేకుండా జిహాద్ అనుకుంటూ కాల్పులు జరుపుతూ చంపుకుంటూ ముందుకు వెళ్ళారు. దారిలో ముంబై పోలీసులు ఎదురించిన వాళ్ళ ఆయుధ శక్తి ముందు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయపడ్డారు. ఇక ముంబై పోలీసులుకు ఇతర రక్షక సిబ్బంది వాళ్లని నిలువరించే శక్తి లేదు.

అదే సమయంలో మనకి ఉన్న ఒకే ఒక్క రక్షక దళం NSG “National Security Guard”. ఆ రక్షక దళ నాయకుడే MAJOR SANDEEP UNNIKRISHNAN. ఇప్పుడు మొదలైంది అసలు కథ, లోపల వున్నది ఒకడా… వంద మందా కాదు, వాళ్ళ దగ్గర వున్నది విధ్వంసకర ఆయుధాలు ఎన్ని వున్నాయా అన్నది ముఖ్యం కాదు. జిహాద్ అనే ఉన్మాదుల నుంచి ఏ ఒక్కరికీ హని కలగకుండా తిరిగి తీసుకురావాలి అనే ఒకే ఒక్క ఉద్దేశం NSG కి ఉంది. ఈ క్రమంలో వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని తెలిసిన దేశం మీద వాళ్ళకి వున్న ప్రేమ, గౌరవం ముందు ప్రాణం ఒక తృణ ప్రాయం. NSG దళానికి నాయకత్వం మేజర్ సందీప్ తీసుకున్నారు. నాయకుడు అంటే నడిపే వాడే కాదు, ముందుండి నడిపించే వాడు.

తాజ్ హోటల్ పైన హెలికాప్టర్లో నుంచి NSG Commandos దిగి OPERATION BLACK TORNADO మొదలుపెట్టారు. రోప్ వేస్ సహాయంతో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ చేరుకుంటూ మరికొంత మంది తాజ్ హోటల్ చేరుకున్నారు. పై నుంచి మొదలు పెట్టుకుంటు ఒక్కో అంతస్తు బ్లాక్ చేసుకుంటూ అక్కడక్కడ చికుకున్న ప్రజలను కాపాడుకుంటు కిందకి వస్తారు. అదే సమయంలో ఒక ఉగ్రవాది హఠాత్తుగా జరిపిన దాడిలో ఒక NSG Commando కాలుకి బుల్లెట్ తగులుతుంది. ప్రాణం పెట్టి పోరాడుతున్న సమయంలో సహచరుడుకి అయిన గాయం ఒక పక్క, కదిలితే కాల్చేసే ఉన్మాది ఒక పక్క, దేశ ప్రజలు ఒక పక్క… వేగంగా దూసుకొస్తున్న బుల్లెట్లకు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సహచరుడి ప్రాణాలు కాపాడాడు. ఇక చివరిగా వున్న ఉగ్రవాదులను ఎలాగైనా చంపి బందీలుగా వున్న ప్రజలను కాపాడాలి అనే ఒక్క ఉద్దేశం ఒక్కటే మనసులో కదులుతుంది… తనతో వున్న సహచరులకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజలను రక్షించండి….వాళ్లని నేను ఎదుర్కొంటా… “You can take me… You can take me… not my Country!” అనుకుంటూ ఒక్కసారిగా ప్రత్యర్థుల మీద దాడికి దిగాడు… వాళ్ళ పై మెరుపు దాడితో విరుచుకుపడ్డాడు, ఆ దాడి ఎలా వుంటుంది అంటే… 6 అడుగుల ఎత్తు, 70 కిలోల బరువు, టన్నుల్లో దేశ పొగరు… అన్ని కలిసి ఒక్కసారిగా ఉగ్రవాదుల మీద పడగానే చెల్లా చెదురు అయిపోతారు… ఇదే సరైన సమయం ఉగ్ర సమూహాన్ని నాశనం చేసే ఆ క్షణం… ముందుకు దూసుకుపోతు వాళ్ళ చేతిలో ఆయుధాలను కూడా లెక్క చేయకుండా తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఒంటరి పోరాటం చేస్తాడు… ఈ సమయంలో NSG Commandos సహాయం కోసం వస్తారు… అదే వాళ్ళకి కొంత శాపంగా మారింది. ఇదే అదునుగా తీసుకొని ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరపగా ఆ దాడిలో మేజర్ సందీప్ గాయపడి అక్కడే వీర మరణం పొందాడు. మిగిలిన ఉగ్రవాదులను ఆ దళం మట్టుపెట్టడంతో కొంచం ఉపశమనం దేశానికి… కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడుల కోసం ఐసిస్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలు దేశ ప్రతిష్టంభన దెబ్బతీసేకి సమూహాలను తయారు చేస్తూనే వుంటాయి. వాళ్ళ నుంచి కాపాడడానికి మనలో ఎంతోమంది MAJOR లు ఉద్భవిస్తునే వుంటారు.
A Great Tribute To MAJOR SANDEEP UNNIKRISHNAN!

ప్రజలని కాపాడడానికి దైర్యం ఒకటి వుంటే సరిపోదు, ప్రాణహాని జరగకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు మన ప్రాణానికి ముప్పును చేకూరుస్తాయి అని తెలిసి కూడా ముందుకెళ్ళి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం త్యాగం చేశారు. ఇలాంటి సందర్భాలను మేజర్ సందీప్ ఎన్నో సార్లు ఎదుర్కొన్నారు. ఆ అనుభవం తాజ్ హోటల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడడానికి సహాయపడింది.
-Prem Sai Gorentla