Journey of Fukkard
ఈ మాటలని మా యొక్క ప్రస్థానంగా కంటే మా పేజ్ ని ఇన్నాళ్లుగా అనుసరిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న మా followers కి ప్రేమతో రాసే ఉత్తరంగా చెప్పటం సబబేమో!
ఈ పేజ్ ని మొదలు పెట్టినప్పుడు మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళము. అప్పటికే కొన్ని సినిమాలు పనిచేసి ఉన్నాము. కానీ అప్పట్లో మాకు Mainstream కమర్షియల్ సినిమా పట్ల చాలా వ్యతిరేక భావం ఉండేది. అది ఎంతగా అంటే… మా పేజ్ పేరు Fukkard (Fuck Hard!) అని కమర్షియల్ సినిమా ని ఉద్దేశించి పెట్టేంతగా! కానీ, పోను పోను కమర్షియల్ సినిమా వెనక ఉండే కష్టాన్ని, దాని సమీకరణాలని, సవాళ్ళని అర్థం చేసుకోగలిగాం! తద్వారా కమర్షియల్ సినిమా పట్ల మాకున్న వ్యతిరేకత క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ మా పేజ్ యొక్క ప్రధాన లక్ష్యం INDEPENDENT CINEMA ని ప్రమోట్ చేయడమే!
క్రమంగా మా పేజ్ యొక్క పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. ఫాలోవర్ లు పెరుగుతూ పోయారు. సినిమా పరిశ్రమలో మాకు గుర్తింపు రాసాగింది. మేము చిన్నప్పటినుండి కొలుస్తూ పెరిగిన మాకు ఇష్టమైన దర్శకులూ, మరెందరో సినీ ప్రముఖులూ మా పేజ్ ని అనుసరించడం మొదలైంది. ఇది మేము సాధించిన ఘనమైన విజయంగా మేము భావిస్తున్నాము!
ఎన్నో పేరొందిన ప్రొడక్షన్ హౌజులతో మాకు పరిచయాలు ఏర్పడ్డాయి. కానీ ముందు చెప్పినట్లుగా మా దృష్టంతా INDEPENDENT CINEMA పైనే. ఎటువంటి వెన్నుదున్ను లేకుండా పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టి రకరకాల సవాళ్ళను ఎదుర్కొంటూ తమ సృజనాత్మకత ను ప్రపంచానికి పరిచయం చేయాలని పరితపించే వారిని మా ఫాలోవర్స్ అయిన మీకు పరిచయం చేయడమే మా ప్రధాన లక్ష్యం. సాధారణంగా చాలా మంది కొత్త నిర్మాతలు సినిమా ఫైనల్ కాపీ పూర్తయ్యే సరికి డబ్బులన్నీ ఖాళీ చేసుకుని వుంటారు. ఇక సినిమా ప్రమోషన్ సంగతి దేవుడెరుగు! అలాంటి వారి సినిమాలో ‘విషయం’ ఉందని మాకనిపిస్తే వారికి మా పేజ్ ఎప్పుడూ అండగా ఉంటుంది. సోషల్ మీడియా లో మాకున్న ఫాలోవర్స్ కి అలాంటి చిత్రాలని చేరువ చేయడంలో మేము ఎప్పుడూ ముందుంటాము
మా ప్రయత్నం మహాసముద్రం లో నీటి బొట్టే కావొచ్చు కానీ మా వల్ల ఒక విన్నూత్నమైన సినిమా కాస్త ఉపయోగం పొందినా అది మాకు చాలా ఆనందం.
ఇప్పటికే మాకు విన్నూత్నమైనవిగా కనిపించిన ఎన్నో చిత్రాలని మీ ముందు ప్రమోట్ చేశాము. ఫలానావి అని పేర్లు చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రోజులుగా మా పేజ్ ని ఆదరిస్తూ వస్తున్న మీకు తెలుసు
చివరగా మా పేజ్ ని నిలబెట్టి, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ వస్తున్న ఫాలోవర్స్ అందరికీ మా మనఃపూర్వక కృతజ్ఞతలు. మీరు మాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీరు మా పై చూపిస్తున్న ప్రేమ కు బదులుగా మా ప్రయాత్నాన్ని ఇంకాస్త ముమ్మరం చేస్తాం
– మీ FUKKARD
LONG LIVE INDEPENDENT CINEMA.